నవతెలంగాణ మరిపెడ: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయిస్తున్నా..అధికారులు వెంటనే వాటిని సరిచేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని కోడిచర్ల తండవాసులు ఓటు వేయకుండా నిరసనకు దిగారు. తమ తండాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నందును వృద్ధులు,వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. బస్సు సౌకర్యం కూడా లేనందును తండాలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు . విషయం తెలుసుకున్న కొత్తూరు ఎమ్మార్వో తండా ప్రజలకు వచ్చే ఎన్నికల నాటికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ అనంతరం తాండ వసూలు నిరసనను విరమించారు.