లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్‌ బ్రాండ్‌ కంపెనీ లావా మార్కెట్లోకి కొత్తగా ‘అగ్ని 2’ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్టు ప్రకటించింది. కర్వ్డ్‌ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ ధరను రూ.19,999గా నిర్ణయించింది. ఇది మధ్య శ్రేణీ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలుదారులకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. మీడియాటెక్స్‌ నూతన డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌,50 ఎంపి క్వాడ్‌ కెమెరా, 8జిబి ర్యామ్‌, 256 స్టోరేజీతో అందిస్తోన్నట్లు పేర్కొంది. 4700 ఎంఎహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ కేవలం 16నిమిషాల్లో50శాతం చార్జింగ్‌ను చేరుకుంటుందని తెలిపింది.

Spread the love