అగ్ని ప్రైమ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ పరీక్ష సక్సెస్‌

– ఒడిశా తీరంలో డీఆర్‌డీఓ ప్రయోగం 
భువనేశ్వర్‌ : కొత్త జనరేషన్‌కు చెందిన అగ్ని ప్రైమ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. డీఆర్డీవో ఈ పరీక్ష చేపట్టింది. ఒడిశా తీరంలో ఉన్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి దీన్ని పరీక్షించారు. బుధవారం రాత్రి పూట ఈ పరీక్షను నిర్వహించారు. ఫ్లయిట్‌ టెస్ట్‌ సమయంలో ఆ క్షిపణి అన్ని లక్ష్యాలను సక్సెస్‌ఫుల్‌గా చేరుకున్నట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు.మూడుసార్లు విజయవంతంగా ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాతే ప్రీ ఇండక్షన్‌ నైట్‌ లాంచ్‌ను చేపట్టారు. బాలిస్టిక్‌ క్షిపణికి చెందిన కచ్చితత్వాన్ని, విశ్వసనీయతను టెస్ట్‌ చేశారు. రేడార్‌, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ను వేర్వేరు ప్రాంతాల్లో మోహరించి ఈ పరీక్షను కొనసాగించారు. క్షిపణికి చెందిన ఫ్లయిట్‌ డేటాను పూర్తిగా సేకరించారు.డీఆర్డీవోకు చెందిన సీనియర్‌ అధికారులు, స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ అధికారులు ఈ పరీక్షను ప్రత్యక్షంగా వీక్షించారు. అగ్ని ప్రైమ్‌ క్షిపణి పరీక్ష విజయవంతమైన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఆర్డీవో అధికారులను అభినందించారు.

Spread the love