వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గానికి సన్మానం

– శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-తాండూరు
బషీరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో బుధవా రం ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మా ట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు అంతా కలిసి పనిచేస్తూ ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కారం అయ్యేలా కృషి చేయాల న్నారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌లను సన్మానించారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌గా శాంతాబాయి రామునాయక్‌, మార్కెట్‌ కమి టీ వైస్‌ చైర్మన్‌గా మంతటి బోయిని కృష్ణ, మార్కె ట్‌ కమిటీ డైరెక్టర్లుగా వెంకట్రామిరెడ్డి, శివరాం నాయక్‌, భానుచందర్‌, నిర్మల, నరసమ్మ, రాము లు, మధుసూదన్‌ గౌడ్‌, జగన్నాథ్‌, చంద్రశేఖర్‌, లక్ష్మయ్య, పకీర్‌ అహ్మద్‌, పాండురంగం నూతన పాలక మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జి ల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజు గౌడ్‌, బషీరాబాద్‌ మండ ల సీనియర్‌ నాయకులు నర్సిరెడ్డి (రాజ పటేల్‌), రాము నాయక్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాండు రంగా రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మెన్‌ రవీం దర్‌ తన్వర్‌, కో-ఆప్షన్‌ మెంబెర్‌ అబ్దుల్‌ రజాక్‌, మండల యూత్‌ అధ్యక్షులు తాహేర్‌ బాండ్‌ స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love