వైద్యులకు సాయంగా ఏఐ..

నవతెలంగాణ – న్యూయార్క్‌: ఆస్పత్రులలో చికిత్సలను మెరుగుపరచడానికి, రోగులు వేగంగా కోలుకునేలా చేయడానికి కృత్రిమ మేధ అయిన (ఏఐ) బాగా ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. గత అనుభవాల ఆధారంగా రూపొందిన మెషీన్‌ లెర్నింగ్‌ సాధనాలు.. సకాలంలో చికిత్సలు అందించేలా చూస్తాయని గుర్తించారు. రోగుల్లో ప్రతికూల మార్పులను ముందే పసిగట్టి, వైద్య బృందాన్ని అప్రమత్తం చేస్తే.. ఆస్పత్రుల్లో వైద్య పరిరక్షణ 43 శాతం మెరుగుపడుతుందని, అకాల మరణాలూ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని  వారు అభిప్రాయపడ్డారు. న్యూయార్క్‌లోని మౌంట్‌ సైనాయ్‌ ఆస్పత్రి నిపుణులు ఈ పరిశోధనలు చేశారు.

Spread the love