కృత్రిమ మేధస్సు(ఏఐ) విస్తరణ ప్రపంచవ్యాప్తంగా కార్మిక మార్కెట్ ను భారీగా దెబ్బ తీస్తుందని, ప్రపంచ కంపెనీలలో భారీ తొలగింపులకు దారితీస్తుందని బుధవారం ప్రచురించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్య్లూఈఎఫ్) విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ నివేదిక హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా వందలాది పెద్ద వ్యాపారాలను సర్వే చేసిన అధ్యయనం, ఏఐ కి పెరుగుతున్న సామర్థ్యాలకు ప్రతిస్పందనగా 2030 నాటికి 41 శాతం కంపెనీలు తమ శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని యోచిస్తున్నాయని కనుగొంది. ఇంకా, 77 శాతం కంపెనీలు 2025 నుంచి 2030 వరకు మెరుగైన మానవ-యంత్ర సహకారం కోసం తమ ప్రస్తుత సిబ్బందికి నైపుణ్యాన్ని పెంచడానికి సిద్ధమవుతున్నాయి.
దశాబ్దం చివరి నాటికి 170 మిలియన్ల కొత్త ఉద్యోగాలు స ృష్టించబడితే.. 92 మిలియన్ల ఉద్యోగాలు తొలగించబడతాయని నివేదిక అంచనా వేసింది. ఏఐ, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీలలో నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంటుందని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ”జనరేటివ్ ఏఐ మరియు వేగవంతమైన సాంకేతిక మార్పుల వంటి ధోరణులు పరిశ్రమలను, కార్మిక మార్కెట్లను పెంచుతున్నాయి. అపూర్వమైన అవకాశాలను, తీవ్ర నష్టాలను స ష్టిస్తున్నాయి” అని డబ్లుఇఎఫ్ లో ”పని, వేతనాలు మరియు ఉద్యోగ సష్టి” విషయాల అధిపతి టిల్ లియోపోల్డ్ అన్నారు.
ఏఐ, రోబోటిక్స్ మరియు ఇంధన వ్యవస్థలలో, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ ఇంజనీరింగ్‌లో పురోగతి ఈ రంగాలలో నిపుణుల పాత్రలకు డిమాండ్‌ను పెంచుతుందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. ఏఐ, ఇతర సాంకేతిక ధోరణుల కారణంగా సంఖ్యలో అతిపెద్ద క్షీణతను ఎదుర్కొనే ఉద్యోగ వర్గాలను కూడా నివేదిక గుర్తించింది. వాటిలో సర్వీస్ క్లర్క్ లు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీలు, పేరోల్ క్లర్క్ లు, గ్రాఫిక్ డిజైనర్లు ఉన్నారు.
”వేగంగా తగ్గుతున్న టాప్ 10 ఉద్యోగ విభాగాల జాబితాలో గ్రాఫిక్ డిజైనర్లు, లీగల్ సెక్రటరీలు ఇద్దరూ ఉండటం, ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ యొక్క మునుపటి ఎడిషన్లలో కనిపించని మొదటి అంచనా. ఇది జెన్ ఏఐ కి జ్ఞాన పనిని నిర్వహించడానికి పెరుగుతున్న సామర్థ్యాన్ని వివరిస్తుంది” అని నివేదిక పేర్కొంది.ఏఐ ప్రభావం ఉద్యోగ స్థానభ్రంశానికి మించి విస్తరించిందని, మానవ ఉత్పత్తిని పూర్తిగా భర్తీ చేయకుండా పెంచడానికి సాంకేతికత సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుందని నివేదిక నొక్కి చెప్పింది.సృజనాత్మక ఆలోచన, స్థితిస్థాపకత, ఆవశ్యత మరియు చురుకుదనం వంటి ”మానవ-కేంద్రీక త నైపుణ్యాలు” కీలకంగా కొనసాగుతాయని డబ్ల్యూఈఎఫ్ తేల్చింది. ఇంతలో, ఇటీవలి సంవత్సరాలలో ఉన్నత స్థాయి వ్యక్తులు, శాస్త్రవేత్తలు ఏఐ వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం, కంప్యూటర్ శాస్త్రవేత్త, రచయిత పాల్ గ్రాహం రచన కోసం ఏఐ ని ఉపయోగించడం వల్ల కొన్ని దశాబ్దాలలో ఎక్కువ మంది ప్రజలు నైపుణ్యాన్ని కోల్పోతారని హెచ్చరించారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం వల్ల కార్మిక మార్కెట్ గణనీయంగా మారుతుందని టి-బ్యాంక్ ఏఐ రీసెర్చ్ లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ లాబోరేటరీ అధిపతి డేనియల్ గావ్రిలోవ్ అన్నారు. మానవుడు చేయగలిగే ప్రతిదాన్ని ఏఐ చేయగలదు . యంత్రాలు దానిని బాగా చేయగలవని ఆయన అన్నారు. స్వల్ప, మధ్యస్థ కాలాలలో, ఉద్యోగులు పోటీతత్వాన్ని కొనసాగించడానికి ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుందని గావ్రిలోవ్ గుర్తించారు.