నవతెలంగాణ – తమిళనాడు: బీజేపీతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు తమిళనాడులో ఇది కీలక పరిణామం. చెన్నైలో అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మునుస్వామి మాట్లాడుతూ… ఎన్డీయే కూటమితో బంధాన్ని తెంచుకున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.