నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా సిపిఎం ఆఫీస్ లో ఐద్వా మహిళా సంఘం విస్తృతస్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ మండలాల మహిళా ఐద్వా కార్యకర్తలు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు గారు మాట్లాడుతూ..బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలపై హింస రోజు రోజుకి పెరిగిపోతుందని ఈ కాలంలో హత్యలు హత్యాచారాలు దాడులు విపరీతంగా పెరిగిపోయాయని , వీటన్నిటిని అరికట్టాలంటే రానున్న కాలంలో మహిళలంతా ఏకమై ఐక్య పోరాటం చేయడం వల్లనే సాధ్యమవుతుందని అన్నారు , మనువాద సిద్ధాంతం ప్రకారం మహిళలను వంటింటికే పరిమితం చేసి పిల్లల కనే యంత్రంగా భావించే ధోరణి తోటి ఉన్నారని ఈ విధానానికి వ్యతిరేకంగా మహిళలందరూ పోరాటాలు చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించి ప్రజల మధ్య ఐక్యతను చటానికి కృషి చేయాలని పెరు గుతున్న ధరలను అరికట్టటానికి సంఘటిత పోరాటం చేయాలని అన్నారు. అనంతరం నూతన జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ఏ అనిత జిల్లా కార్యదర్శి బి సుజాత , జిల్లా ఉపాధ్యక్షులు కే లావణ్య జిల్లా ఉపాధ్యక్షులు బి అనసూయ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ మీరా , గంగామణి మరో ఆరుగురిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.