నవతెలంగాణ-గాంధారి : గాంధారి మండల కేంద్రంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి కార్యక్రమంని ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి ఎంపీపీ రాధ బలరాం, జెడ్పిటిసి శంకర్ నాయక్ ,తో కలిసి గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ పూలమాలవేసి నివాళులర్పించారు అలాగే గ్రామంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు తూర్పు రాజు, పత్తి శ్రీనివాస్ , ఎఏంసి వైస్ చైర్మన్ రెడ్డిరాజు, ఉప సర్పంచ్ కొమ్ముల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,మండల రజక సంఘం అధ్యక్షుడు కృష్ణ,రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు