మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ 

– ధీర వనిత చిట్యాల ఐలమ్మకు ఘన నివాళులు
– రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ వేల్పూర్ : చాకలి(చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, బానిసత్వ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమె పోరాట స్ఫూర్తిని చాటేలా అధికారికంగా జయంతి, వర్ధంతిని నిర్వహిస్తోందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎసిపి  జగదీష్ చందర్, రైతు నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు, పలువురు రజక నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love