ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం..

– జయంతిలో సర్పంచ్ ద్యావనపల్లి మంజుల 

నవతెలంగాణ-బెజ్జంకి 
తొలి భూపోరాటానికి నాంధి పలికిన వీరనారీ..సామాజిక పరిణామానికి స్త్రీ దైర్యశాలి చాకలి ఐలమ్మనేనని..అమె పోరాటం స్ఫూర్తిదాయకమని సర్పంచ్ ద్యావనపల్లి మంజుల కొనియాడారు.మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద సర్పంచ్ మంజుల అధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు.వార్డ్ సభ్యులు,ప్రజా సంఘాల నాయకులతో కలిసి సర్పంచ్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహనికి బీఆర్ఎస్,రజక సంఘం,ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేశారు.వార్డ్ సభ్యుడు బాలయ్య,పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు గుభిరే మల్లేశం, ప్రజాసంఘాల నాయకులు హజరయ్యారు.
Spread the love