నవతెలంగాణ – హైదరాబాద్: ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. 40 టన్నుల చొప్పున బరువున్న 3 బోట్లను కలిపి కట్టడంతో అవి 120 టన్నులు అయ్యాయి. 50 టన్నుల బరువు ఎత్తగలిగే భారీ క్రేన్లతో లేపేందుకు ప్రయత్నించినా అవి కదల్లేదు. దీంతో పడవలను నీటిలోనే కత్తిరించి, తొలగించేందుకు విశాఖ నుంచి 120 టన్నుల కెపాసిటీ కలిగిన ఎయిర్ బెలూన్లను తెప్పిస్తున్నారు. ఈ సాయంత్రం వరకు బోట్లను తొలగించనున్నారు.