విమాన ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ ప్రకటన

నవతెలంగాణ – హైదరాబాద్: మెదక్ జిల్లా తూప్రాన్ లో శిక్షణ విమానం కూలడంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది. మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుండిగల్ ఎయిర్‌పోర్టు శిక్షణ విమానం కుప్ప కూలింది. అయితే..ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.. పైలెట్‌, ట్రైనీ పైలెట్‌ సజీవదహనం అయ్యారని సమాచారం అందుతోంది. తూప్రాన్‌ రావెల్లి శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. అయితే…మెదక్ జిల్లా తూప్రాన్ లో శిక్షణ విమానం కూలడంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది. “హైదరాబాదులోని AFA నుంచి సాధారణ శిక్షణ కార్యక్రమంలో ఈ ఉదయం ‘PC 7 Mk II’ విమానం ప్రమాదానికి గురైంది. విమానంలోని ఇద్దరు పైలెట్లు చనిపోయినట్లు గుర్తించినట్లు IAF ధృవీకరించింది. ఇతరుల ఆస్తి, ప్రాణాలకు నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ ని ఆదేశించాం” అని ట్వీట్ లో పేర్కొంది.

Spread the love