జైపూర్: ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకోగానే ప్రయాణీకుడి మొబైల్ ఫోన్ పేలడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు. సమస్యను పసిగట్టి చక్కదిద్దిన అనంతరం గంట సమయంలో విమానం ఉదరుపూర్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఇక జూన్ 21న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.