నవతెలంగాణ-ఢిల్లీ: కల్లోలిత బంగ్లాదేశ్‌కు ఎయిరిండియా బుధవారం విమానాలను నడపనుంది. ముందే షెడ్యూల్ చేసిన సర్వీసులను యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించింది. విస్తారా, ఇండిగో సైతం అదే బాటలో పయనించనున్నాయి. ఆ దేశ రాజధాని ఢాకాకు విమానాలు వెళ్తాయని ప్రకటించాయి. మరోవైపు బంగ్లాలో ఉన్న భారతీయులను భారత్‌కు చేర్చేందుకు ఎయిరిండియా బుధవారం ఒక ప్రత్యేక విమానాన్ని సైతం ఢాకాకు పంపనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం తెలిపారు. వారిలో తొమ్మిది వేల మంది విద్యార్థులేనని వెల్లడించారు. పెద్దమొత్తంలో విద్యార్థులు జులైలోనే భారత్‌కు తిరిగి వచ్చేశారని చెప్పారు. దౌత్యవేత్తల ద్వారా అక్కడున్న భారతీయులతో మాట్లాడుతున్నామన్నారు. మైనారిటీల పరిస్థితులను గమనిస్తున్నామని తెలిపారు.