బంగాళాఖాతంలో వాయుగుండం..

నవతెలంగాణ – హైదరాబాద్: బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వచ్చే 12 గంటల్లో అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ కారణంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నాగపట్నం, చెంగల్‌పట్టు, తిరువావూర్‌, కడలూరు సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Spread the love