నవతెలంగాణ – హైదరాబాద్: ముంబై-దుబాయ్ ఎయిరిండియా విమానాన్ని అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. నిన్న రాత్రి 8 గంటలకు బయలుదేరాల్సిన విమానం 50 నిమిషాల తర్వాత ముంబైలో ల్యాండ్ చేశారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించాక తెల్లవారుజామున 4 గంటలకు విమానం బయలుదేరింది. విమానంలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులే ఉన్నారు.