దేశంలోనే మొదటి సంఘం ఏఐఎస్ఎఫ్

– ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చిట్యాల శేఖర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దేశంలో మొట్టమొదటగా విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం  పోరాడుతున్న సంఘం ఏఐఎస్ఎఫ్ సంఘం అని జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చిట్యాల శేఖర్ అన్నారు..శనివారం హుస్నాబాద్ లో ఏఐఎస్ఎఫ్ 88 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ బ్రిటిష్ ముష్కరుల పాలన నుండి విముక్తి కోసం, దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడమే లక్ష్యంగా 1936 ఆగస్టు 12 న ఉత్తరప్రదేశ్ లోని లక్నో లోని బెనారస్ విశ్వవిద్యాలయం లో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని అన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో సుమారు నాలుగువేల మంది ఏఐఎస్ఎఫ్ నాయకులు అమరులయ్యారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం సిద్దించిన తర్వాత దేశంలోని పేద,బడుగు,బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందాలని గత 88 సంవత్సరాలుగా చదువు-పోరాడు అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. శాంతి, అభ్యుదయం, శాస్ర్తయ విద్యావిధానం లక్ష్యాలుగా నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. నాటి స్వతంత్ర పోరాటం నుండి నేటి మలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విద్యను పూర్తిగా కార్పోరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు.  కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ఏఐఎస్ఎఫ్ గా నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్, చందు, శ్రీను, రమణ, స్వప్న, శైలజ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love