16న జరిగే సమ్మెను జయప్రదంచేద్దాం: ఎఐటీయూసీ

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పౌర ప్రజాస్వామ్య పాలన అంతమైందని పెట్టుబడుదారి విధానం కొనసాగుతుందని దీనిపైఈనెల 16న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎఐటీయూసీ అనుబంధ సంఘం హెచ్ పి సిఎల్ ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్స్ & వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం హెచ్ పి సిఎల్ కంపెనీ ముందు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కార్మిక వర్గం దశాబ్ద కాలాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలలో 29 రకాల చట్టాలను పూర్తిగా రద్దుచేసి, మిగిలిన వాటిని నాలుగు కోడలుగా విభజించి కార్మిక లోకానికి అన్యాయం చేసింది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. పాలనలోఏ వర్గ ప్రజలు కూడా సుఖసంతోషాలతో లేరని హెచ్ పి సీఎల్ కార్మికుల శ్రమను యాజమాన్యం దోపిడీ చేస్తుందని వారి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వడం లేదని అన్నారు. అలాగే ఉద్యోగ భద్రత లేదని పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తూ పది లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక శక్తి కూడా రానున్న రోజుల్లో మే డే స్ఫూర్తితో సమరశీల పోరాటాల సన్నద్ధం కావాలని ఈనెల 16 న ఐక్య కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్త బంద‌్ కు సన్నద్ధం కావాలని కార్మికు లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్ యూనియన్ అధ్యక్షుడు బాబా కోశాధికారి నాగరాజు సాయిబాబా శ్రీకాంత్ జిల్లా ఏఐటీయూసీ గౌరవ సలహాదారులు చామల అశోక్ సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు షేక్ లతీఫ్, నీలా  శ్రీనివాస్,  శ్యాంసుందర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి రాజారామ్ సహాయ కార్యదర్శిలు  టి సుధాకర్ రెడ్డి జీవి రాజు ఎస్ రాఘవరెడ్డి  దీకొండ శ్రీనివాస్, రమేష్, మల్లికార్జున్, దికొండ రవి, పెండ్ర  కృష్ణ, రేగటి లింగయ్య  తదితరులు పాల్గొన్నారు.
Spread the love