సెంటినరీ కాలనీలో ఏఐటియుసి మహాపాడావ్ కార్యక్రమం 

– అనంతరం ఆర్ జి-3 నూతన బ్రాంచ్ కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-రామగిరి 
రామగుండం-3 ఏరియాలోని సెంటినరీ కాలనీ కె ఎల్ మహేంద్ర భవన్ లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ 6 వ మహాసభలు ఏఎల్పి పిట్ సెక్రటరీ ఇప్ప గంగాధర్  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా ఏఐటీయుసి జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు రాజ్ కుమార్, విరభద్రయ్య, వైవి రావు , సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ప్రకాష్ , అర్జీ-2 బ్రాంచ్ సెక్రటరీ రాజారత్నం, కాంట్రాక్ట్ వర్కర్స్ డివిజన్ ఇంచార్జ్ బుర్ర తిరుపతి  పాల్గొని యూనియన్ చరిత్ర  కార్మికుల సమస్యల పరిష్కారానికి చేయవలసిన పోరాట ప్రణాళికలను వివరించి సెంటినరి కాలనీ కార్మిక వాడల్లో బైక్ ర్యాలీ నిర్వీహించారు. అనంతరం అర్జీ-3 బ్రాంచ్ నూతన కమిటీ నీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ లో ఆర్ జి-3 బ్రాంచ్ కార్యదర్శి గా ఎంఆర్ సి రెడ్డిని బ్రాంచ్ కౌన్సిల్ మెంబెర్స్ అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో బ్రాంచ్ ఇంచార్జి గా  జూపాక రాంచందర్, వైస్ ప్రెసిడెంట్ గా కందికట్ల సమ్మయ్య, అసిస్టెంట్ సెక్రటరీగా డిటి రావు, జాయింట్ సెక్రరరీగా రవికుమార్, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జిగా డి శ్రీనివాస్, ట్రేడ్స్మెన్ ఇంచార్జిగా ఎన్వీ రాజు , ట్రెసరర్ గా సంబశివారెడ్డి, ఆర్గనైసింగ్ సెక్రటరీలు గా బాధవత్ రాజేష్, మర్ద కిరణ్ కుమార్,బుర్ర శ్రీనివాస్, ఎ పోషం, కె మల్లేష్ లను ఎన్నుకున్నారు.
Spread the love