నవతెలంగాణ – హైదరాబాద్; పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నట్లు తమిళ హీరో అజిత్ తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ రోజు నా తండ్రి జీవించే ఉంటే బాగుండేది. ఆయన నన్ను చూసి గర్వపడేవారు. నా తల్లి ప్రేమకు, త్యాగాలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నాకు ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదని, అనేక మంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నా’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.