మాజీ డిప్యూటీ సీఎంకు మరుగుదొడ్లు కడిగే శిక్షని విధించిన అకల్ తఖ్త్

నవతెలంగాణ – హైదరాబాద్: సిక్కు మతాన్ని అవమానించిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంకు అనుకూలంగా వ్యవహరించినందుకు పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సహా పలు గురుద్వారాల్లో బాత్రూములు కడగాలని, వంటగదిలో అంట్లు తోమాలంటూ సిక్కుల అత్యున్నత కమిటీ అకల్ తఖ్త్ ఆదేశించింది. అలాగే, సిక్కు సమాజానికి సేవలు అందించినందుకు గాను సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు 2011లో అందించిన ‘ఫఖ్ర్-ఈ-క్వామ్ గౌరవాన్ని వెనక్కి తీసుకుంది.

Spread the love