పావలా శ్యామలకు అండగా ఆకాష్ పూరి

నవతెలంగాణ – హైదరాబాద్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సీనియర్ నటి పావలా శ్యామల ఓ వీడియో ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన డైరెక్టర్ పూరి తనయుడు యంగ్ హీరో ఆకాశ్ పూరి ముందడుగు వేశారు. ఆశ్రమంలో ఉన్న శ్యామల పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆమెకు రూ. లక్ష సహాయం అందించి, ఏ విధమైన సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. అయితే, వీడియో విడుదలై వారం గడిచిన ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటి వరకు స్పందించలేదు.

Spread the love