ఎమ్మెల్యే సీటుకు అఖిలేష్ రాజీనామా

నవతెలంగాణ-హైదరాబాద్ : సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఘన విజయం సాధించిన యూపీలోని కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ఆయన కొనసాగనున్నారు. ఉత్తరప్రదేశ్ కర్హల్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని అఖిలేష్ యాదవ్ మంగళవారంనాడు ప్రకటించారు.
కాగా, కర్హాల్, మెయిన్‌పురి కార్యకర్తలను తాను కలుసుకున్నానని, రెండు చోట్లా ఎన్నికల్లో గెలిచినందున ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుందని తెలియజేశానని అఖిలేష్ తెలిపారు. త్వరలోనే విధాన సభను వదులుకోనున్నట్టు చెప్పారు.

Spread the love