బుమ్రా బౌలింగ్ పై కోచ్ కూడా జోక్యం చేసుకోరు: అక్షర్ పటేల్

నవతెలంగాణ – హైదరాబాద్ : టీమ్‌ఇండియా పేస్ గన్ బుమ్రా విషయంలో బౌలింగ్ కోచ్ కూడా పెద్దగా జోక్యం చేసుకోరని సహచర బౌలర్ అక్షర్ పటేల్ వెల్లడించారు. బుమ్రాకు మ్యాచ్‌పై స్పష్టమైన అవగాహన ఉంటుందని అన్నారు. ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసని తెలిపాడు. బౌలింగ్ కోచ్ కూడా ఎక్కువ ఇన్‌పుట్స్ ఇచ్చి అతడిని అనవసరంగా గందరగోళానికి గురిచేయరని వివరించారు. బుమ్రాను తన వ్యూహాలకు అనుగుణంగానే బౌలింగ్ చేయమని ప్రోత్సహిస్తారని  వివరించారు.

Spread the love