అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ గెలుపు

– 30,573వేల మెజార్టీతో విజయుడు గెలుపు
– రెండో స్థానంలో సంపత్‌ కుమార్‌
అలంపూర్‌: అలంపూర్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు 1లక్ష 4వేల 60 ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌ కుమార్‌ 73 వేల 487 ఓట్లుతో రెండో స్థానంలో నిలిచారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌ 6వేల 82 ఓట్లు సాధించి మూడవ స్థానంలోను, బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌ 4వేల 712 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు 30, 573 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌ పై గెలుపొందారు. నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 37వేల 938 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 82.50 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. అలం పూర్‌ నియో జకవర్గంలో బీఆర్‌ఎస్‌ గెలుపొందడం పట్ల బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బాణాసంచా కాల్చి ర్యాలీ నిర్వహిస్తూ సంబురాలు జరుపు కున్నారు. విజయుడు గెలుపుపై ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డికి నియోజక వర్గంలోని బీఆర్‌ఎస్‌ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
అయిజ : తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అలంపూర్‌ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు విజయం సాధించారు. అలంపూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌ కుమార్‌పై 21 రౌండ్లకు 30,568 ఓట్ల మెజార్టీతో విజయం వరించింది.

Spread the love