మాయ పాత్రలో అలరిస్తా

In the role of Maya
entertain‘మాయ, వైశాఖం, మీకు మాత్రమే చెప్తా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్‌ అవంతిక మిశ్రా. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘అతిథి’. వేణు తొట్టెంపూడి హీరోగా నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ డిస్నీ ఫ్లస్‌ హాట్‌ స్టార్‌ స్పెషల్స్‌గా రాబోతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ను రాండమ్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై దర్శకుడు భరత్‌ వైజీ రూపొందించారు. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్‌ డిస్నీ ఫ్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో నాయిక అవంతిక మిశ్రా మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకుంది. ఇందులో నేను మాయ అనే డిఫరెంట్‌ పాత్ర చేశా. ఒక అందమైన అమ్మాయిగా, ఆ తర్వాత దెయ్యంగా కనిపిస్తా. ఆమె ఒక మిస్టీరియస్‌ ఉమెన్‌. అలాగే నా క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి. ఇందులో థ్రిల్లర్‌, ఫాంటసీ, హర్రర్‌ జోనర్స్‌ కలిసి ఉంటాయి. ఇవన్నీ కథలో నెక్ట్‌ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తాయి. వేణుతో కలిసి నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. ప్రస్తుతం నేను ‘గోలీసోడా’ అనే మరో వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను. అలాగే నేను చేసిన మూడు తమిళ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

Spread the love