అల్కరాస్‌ నం.2

Alkaras No.2న్యూఢిల్లీ : మోంటోకార్లో మాస్టర్స్‌ టైటిల్‌తో మట్టికోర్టు సీజన్‌ను ఘనంగా మొదలెట్టిన స్పెయిన్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కరాస్‌ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. తాజాగా విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌ పురుషుల సింగిల్స్‌లో అల్కరాస్‌ వరల్డ్‌ నం.2గా నిలిచాడు. మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత జానిక్‌ సినర్‌ (ఇటలీ) అగ్రస్థానం నిలుపుకున్నాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా), నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) టాప్‌-5లో కొనసాగుతున్నారు. రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వదేవ్‌ 9వ స్థానంలో నిలిచాడు. మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో యూకీ బాంబ్రి, రోహన్‌ బోపన్నలు వరుసగా 26, 39వ స్థానాల్లో నిలిచారు.

Spread the love