నవతెలంగాణ-హైదరాబాద్ : టోల్ రహదారులపై టోల్ వసూలు కోసం ఉద్దేశించిన ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఫాస్టాగ్ వినియోగదారులకు కొత్తగా ‘70 నిమిషాల’ వ్యవధిని నిర్దేశించింది. నిర్దేశిత సమయంలో బ్లాక్‌లిస్ట్‌లోంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు జనవరి 28నే ఓ సర్క్యులర్ జారీ చేసింది.