నవతెలంగాణ హైదరాబాద్: ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్ దాడులకు గురికావొచ్చని అలర్ట్ చేసింది. ఈ మేరకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 91 దేశాల్లోని పలువురు యూజర్లకు థ్రెట్ నోటిఫికేషన్లను పంపించింది.