హైదరాబాద్ వాసులకు అలర్ట్…

నవతెలంగాణ – హైదరాబాద్‌
ఎంఎంటీఎస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ వరకు కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ డివిజన్లలో మౌలిక సదూపాయాల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
రద్దైన రైళ్లు ఇవే..రద్దు చేసిన ఎంఎంటీఎస్ రైళ్లు నెంబర్లు ఇలా ఉన్నాయి. వాటిల్లో రైలు నెం. 47129 (లింగంపల్లి-హైదరాబాద్), రైలు నెం. 47105 (హైదరాబాద్-లింగంపల్లి), రైలు నెం. 47105 (ఫలక్‌నుమా-లింగంపల్లి), రైలు నెం. 47189 (లింగంపల్లి-ఉమ్దానగర్), రైలు నెం. 47181 (లింగంపల్లి-ఉమ్దానగర్ –హైదరాబాద్), రైలు నెం. 47114 (హైదరాబాద్-లింగంపల్లి) ఎంఎంటీస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయని రైల్వే శాఖ వెల్లడించింది.

Spread the love