నవతెలంగాణ-హైదరాబాద్ : డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్ తుది దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఫైనల్ ఫేజ్‌లో 44,683 మందికి సీట్లు అలాట్ చేసినట్లు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ, రేపు విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని సీటును రిజర్వ్ చేసుకోవాలని సూచించారు.