దరఖాస్తుదారులందరు రశీదు తీసుకోవాలి

నవతెలంగాణ-బెజ్జంకి
ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు సమర్పించిన కుటుంబాలు ఖచ్చితంగా రశీదు నెంబర్‌ తీసుకోవాలని ఎంపీడీఓ దమ్మని రాము సూచించారు. మంగళవారం మండల పరిధిలోని గాగీల్లపూర్‌, నర్సింహులపల్లి గ్రామాల్లో ప్రత్యేకాధికారి రాఘవ రెడ్డి, ఎంపీడీఓ రాము ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాగీల్లపూర్‌ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు దరఖాస్తుల కోసం గందరగోళం సష్టించారు. ప్రజాపాలనలో ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా సాగేలా పోలీసులు భాగస్వామ్యమవడంలో అలసత్వం వహించడం పట్ల ఎంపీడీఓ రాము అగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ రాము దరఖాస్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. సర్పంచ్‌ అన్నాడీ సత్యనారాయణ, ఎంపీటీసీ కొమిరే మల్లేశం, ఉపసర్చంచ్‌ బామండ్ల తిరుమల, వార్డ్‌ సభ్యులు, ఏఓ సంతోష్‌ కుమార్‌, పంచాయతీ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాములు, గ్రామస్తులు హజరయ్యారు.
మైనింగ్‌ ఏడీకీ పాలకవర్గం సభ్యుల వినతి
గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా సాగుతున్న ఇసుక దోపిడిని అరికట్టాలని మైనింగ్‌ శాఖ ఏడీ, ప్రత్యేకాధికారి రాఘవ రెడ్డికి పంచాయతీ పాలకవర్గం ప్రజాపాలనలో వినతిపత్రం అందజేశారు. మండలంలోని అధికారులు విధుల్లో అలసత్వం వహించడం వల్లే ప్రకతి ప్రసాదించిన ఇసుక సంపదను అక్రమ రవాణదారులు రాత్రింబవళ్లు కొల్లగొడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఇసుక రవాణను అరికట్టాలని, లేనిపక్షంలో అధికారుల తీరుపై నిరసనలు చేపడుతామని పంచాయతీ పాలకవర్గం సభ్యులు హెచ్చరించారు.

Spread the love