ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి

– ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
వికారాబాద్‌ జిల్లాలోని అసెంబ్లీ నియోజక వర్గాల ఓట్ల లెక్కింపుకు యంత్రాంగం సిద్దమైంది. తాండూరు, పరిగి, వికారాబాద్‌, కోడంగల్‌ నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఓకేసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్ప టికే పరిగి మార్కెట్‌ కమిటిలోని గోదాంలోకి ఈవీఎం, వీవీ ప్యాట్‌లను తరలించా రు. అక్కడే ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించారు. గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిగిలో 1,98,986 సాధారణ ఓట్లు, 2821 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయి. తాండూరులో 1,73,754 సాధారణ ఓట్లు, 1500 పోస్టల్‌ బ్యాలెట్లు పోల్‌ అయ్యాయి, కొడంగల్‌లో 1,93,940 సాధారణ ఓట్లు పోలు కాగా 1165 పోస్టల్‌ బ్యాలెట్లు పోల్‌ అయ్యాయి. వికారాబాద్‌ నియోజకవర్గంలో 1,72,486 సాధారాణ ఓట్లు, 1810 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయి. పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా 305 పోలింగ్‌ కేంద్రాలకు సంబం ధించి 14 టేబుళ్లలో 22 రౌండ్లలో కౌటింగ్‌ నిర్వహించనున్నారు. తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా 269 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 14 టేబుళ్లలో 20 రౌండ్ల ద్వారా కౌంటింగ్‌ జరపనున్నారు. కొడంగల్‌ నియో జకవర్గ వ్యాప్తంగా 275 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 14 టేబుళ్లలో 20 రౌండ్లలలో కౌం టింగ్‌ జరగనుంది. వికారాబాద్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 284 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 14 టేబుళ్లలో 21 రౌండ్లులో కౌంటింగ్‌ జరగనుంది.
కౌంటింగ్‌ ప్రక్రియకు సర్వం సిద్ధం
పరిగిలోని మార్కెట్‌ కమిటీ గోదాంలో ఆది వారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రా రంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం పరిగి పట్టణ కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సందర్శించి కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో కౌంటింగ్‌ విధులు నిర్వహించే కౌంటింగ్‌ సూపర్వైజర్లు, అసిస్టెంట్‌ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వ్‌లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కౌంటింగ్‌ అధికారులు అందరూ సమన్వయంతో సమిష్టిగా పని చేయాల న్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలో సూపర్వై జర్ల పాత్ర చాలా కీలకమని పారదర్శకంగా కౌంటింగ్‌ విధులు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం 5 గంటల వరకే గుర్తింపు కార్డుతో సహా కౌంటింగ్‌ హాల్లో ఉండాలని తెలి పారు. కలెక్టర్‌తో పాటు కౌంటింగ్‌ పరిశీలకులు స్నేహ హిందూరావు పాటిల్‌, సాధన పరిశీలకులు పి.ఆకాష్‌, రిటర్నింగ్‌ అధికా రులు రాహుల్‌ శర్మ, లింగ్యా నాయక్‌, శ్రీనివాసరావు విజయ కుమారిలతో పాటు జిల్లా పరిషత్‌ సీఈవో జానకి రెడ్డి, డీఎస్‌హెచ్‌ఓ చక్రపాణి, డీవైఎస్‌ఓ హనుమంతరావు, డీటీడీఓ కోటాజి, పరిశ్రమ శాఖ అధికారి వినరు కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబు మోజెస్‌, తదితరులు ఉన్నారు.

Spread the love