నవతెలంగాణ – హైదరాబాద్ : న్నికల వేళ ఎమ్ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ముస్లింలు అందరూ బీఆర్ఎస్కు ఓటేయండి అని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ పోటీలో ఉన్న చోట బీఆర్ఎస్కు.. ఎమ్ఐఎమ్ పోటీలో ఉన్న చోట ఎమ్ఐఎమ్కు ఓటు వేయాలని సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్ విసిరారు. పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం కాదని.. దమ్ముంటే రాహుల్ గాంధీ తనపై హైదరాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేయాలని ఛాలెంట్ చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత, సచివాలయ మసీదు కూల్చివేత సీవీ నర్సింహరావు హయాంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని, తిరిగి కాంగ్రెస్ బాబ్రీ మసీదును నిర్మించలేదని, కానీ, సచివాలయంలో కేసీఆర్ మసీదు నిర్మించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో మత కలహాలన్నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయన్నారు.