
పంచాయతీ ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఓటర్ల జాబితా అభ్యంతరాలపై అఖిలపక్ష సమావేశం గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జి జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని తమ సలహాలు సూచనలను చేయడం జరిగింది. వీటిపై ఎంపీడీవో జవహర్ రెడ్డి నాయకుల అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని జాబితా నువ్వు క్షుణ్ణంగా పరిశీలించి తప్పులను సరిచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ శరత్ కుమార్, మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి, పొదిల్ల చిట్టిబాబు, గొంది రాజేష్, జంపాల ప్రభాకర్, లాకావత్ నరసింహ, చిన్న స్వామి, నర్రా శివప్రసాద్, వల్లభనేని శ్రీనివాసరావు, అజ్మీర సురేష్, తేళ్ల హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.