ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం..

నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంటు లైబ్రరీ భవన్‌లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల నిర్వహణపై అఖిలపక్ష నేతలతో కేంద్రం చర్చిస్తోంది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు పూర్తిస్థాయిలో సహకరించాలని విపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టే బిల్లుల వివరాలు అఖిలపక్ష నేతలకు కేంద్రం అందించునుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, ఐపీసీ సీఆర్పీసీ చట్టాలలో చేస్తున్న మార్పులు బిల్లులు పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరుగుతోంది. పొగ మంచు కారణంగా విమానాల దారి మళ్లింపుతో వైసీపీ, టీఆర్ఎస్ నేతలు హాజరు కాలేకపోయారు. తెలుగుదేశం నుంచి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు.

Spread the love