పద్మశాలీలందరూ సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలి: చంద మల్లయ్య

నవతెలంగాణ-ధర్మసాగర్
రాజ్యాధికారంలో వాట కోసం పద్మశాలి లందరూ సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని పద్మశాలిల సంఘం జిల్లా అధ్యక్షులు చంద మల్లయ్య పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని శివుని గుడి ఆవరణలో  ధర్మసాగర్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ గుర్రపు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 13వ తారీకు ఆదివారం రోజున కోరుట్లలో జరిగే పద్మశాలి రాజకీయ యుద్ధభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని దానికి సంబంధించిన గోడపత్రిక లను హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ చందా మల్లయ్య  ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పద్మశాలీలంతా సంఘటితంగా ఒక సమ్మక్క జాతరకు ఎలా పోతారో ఆ విధంగా ఎవరికి వారే కుటుంబ సహితంగా ఈ బహిరంగ సభకు తరలిరావాలని,దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంలో మన పద్మశాలీల వాటా తెలుసుకోవచ్చని గుర్తు చేశారు. పద్మశాలి లందరూ  కలిసికట్టుగా ఉండి, పోరాడితే మన ఓటును మనమే వేసుకోవడం జరిగితే రాష్ట్రంలో 10 నుండి 15 స్థానాల వరకు ఎమ్మెల్యేలను సునాయాసంగా గెలిపించుకోవచ్చునీ తెలిపారు.అదేవిధంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఒక మూడు ఎంపీ స్థానాలను అవలీలగా కైవసం చేసుకోవచ్చని భవిష్యత్తు చెప్పారు. ఏ స్థాయిలోనైనా ఏ పార్టీ నుండైనా మన పద్మశాలి ముద్దుబిడ్డ టిక్కెటు తెచ్చుకునీ నిలబడితే వారికి మనము స్వతంత్రంగా ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు.పద్మశాలీల రాజకీయ యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుడిమల్ల కృష్ణారావు, ఇనుగాల మల్లేశం,జిల్లా యూత్ కోకన్వీనర్ అజయ్,మండల యూత్ అధ్యక్షులు గుర్రపు వినేష్, మండల పద్మశాలి కమిటీ, ధర్మసాగర్ గ్రామ కమిటీ మరియు యువజన సంఘాలు,  తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వారి మిత్రబృందము తదితరులు పాల్గొన్నారు.
Spread the love