పేదలందరికీ 125 గజాలు ఇంటి స్థలం వెంటనే ఇవ్వాలి

– వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య
నవతెలంగాణ-పరిగి
పేదలందరికీ 125 గజాలు ఇంటి స్థలం వెం టనే ఇవ్వాలని వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటయ్య అన్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని పేదలకు 125 గజాల ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించుకునేం దుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభు త్వం రూ.5 లక్షలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక పిలుపు మేరకు సోమవారం పరిగి పట్టణ కేంద్రంలో వ్యకాస, సీఐటీయూ, మహిళ సంఘం, అవాజ్‌ సంఘం ఆధ్వ ర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుటు ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం ఇల్లు లేని పేదలందరికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చే నేటికీ మండలంలో ఒక్క డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇవ్వకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. చెర్వు శిక్కం,భూదన్‌ ఇతర ప్రభుత్వ భూములు ఉన్నా ఆ భూములను రియాల్టర్లు రాజకీ య నాయకులు కబ్జా చేసి దర్జాగా వ్యాపారం చేస్తు న్నారని అధికారులు ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవ రించడం దుర్మార్గమన్నారు. రంగాపూర్‌లోని సర్వేనెం బర్‌ 18, లక్ష్మీదేవిపల్లెలోని భూదన్‌ భూమి, పరిగిలో ని చెరువు శిఖం భూమి, స్వాధీనం చేసుకొని పేదలకు 125 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యకాస, సీఐటీయూ, మహిళా సంఘం, ఎండీ హబీబ్‌, సత్యయ్య, రఘురామ్‌, శేఖర్‌,లాలయ్య, సునీత, అనంతమ్మ, దేవ మ్మ, మాంజిల్‌, రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love