పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

– పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్రూం ఇండ్లు పూర్తి చేయాలి
– లేదంటే గుడిసెలు వేసుకొని ఆక్రమిస్తాం
– తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య
– వికారాబాద్‌లో పర్యటించిన బస్సు యాత్ర
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌. వీర య్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజా సం ఘాల పోరాట వేదిక బస్సు యాత్ర సోమవారం వికారా బాద్‌ జిల్లా కేంద్రానికి చేరకుంది. వికారాబాద్‌ జిల్లా కేంద్రం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీ నర్‌ ఎస్‌.వీరయ్య, కో-కన్వీనర్‌ వెంకట రాములు మాట్లా డారు.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాట ప్రకారం డబుల్‌ బెడ్రూం ఇండ్లు వెంటనే పూర్తి చేసి పేదలందరికీ ఇవ్వాలన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలం లేనివారికి పేదలం దరికీ ఖాళీ స్థలాలు ఇవ్వాలన్నారు. ఖాళీ స్థలం ఉన్నవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణాలకు రూ. 15 లక్షలు ఇవ్వాలన్నారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో పెం డింగ్‌లో ఉన్న మండిగోడల డబుల్‌ బెడ్రూం ఇండ్లకు వెం టనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పూర్తి అయిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను పేదలకు పంచాలన్నారు. లేదంటే తామే పేదలకు ఇండ్లు పంచుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కూడా పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్రూంలు, ఇండ్ల స్థలా లను ప్రజలందరికీ పంచాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. జూలై 3వ తేదీన జిల్లా కలెక్టరేట్లు ముట్టడిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బస్సు యాత్ర బృందం నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, జిల్లా ప్రజాసంఘాల నాయ కులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.మల్లేశం, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్‌.మహిపాల్‌, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.రవి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీను నాయక్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సుదర్శన్‌, కార్య దర్శి సతీష్‌, లాలయ్య, లక్ష్మయ్య, చంద్రయ్య, రాజు, నర్సిం హులు, వెంకట్‌, రామచందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love