– కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చీకటి రోజులే..
– సేవా చేసిన ప్రజలు భారీ మెజార్టీ ఇస్తారనే నమ్మకం..
– కాంగ్రెస్, బిజెపి మాటలు విని మోసపోవద్దు…
– గ్రామాలలో బోనాలతో బాజిరెడ్డి గోవర్ధన్ కు ఘనస్వాగతం..
నవతెలంగాణ-డిచ్ పల్లి
ప్రజలకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోదని, వారి వాన్ని మోసపూరిత వాగ్దానాలు హామీలని, రూరల్ లోని ప్రతి గ్రామంలో అబివృద్ధి చేశానని, నీయోజకవర్గ ప్రజలకు ఏళ్ల వేళల అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో వెన్నంటే ఉన్నానని, ప్రజలపై పూర్తి విశ్వాసం ఉందని, ఈసారి భారీ మెజార్టీ ఇస్తారనే నమ్మకం ఆశాభావం ఉందని,గత పదేళ్ల క్రితం రూరల్ నీయోజకవర్గం ఏలా ఉండేదో నేడు ఏళ ఉందో ప్రజలు భేరిజు వేయాలని, అనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. కరెంట్ కష్టాలు ఎన్నో ఉండేవని, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరు గ్యారంటీ కార్డు లు పేరు చెప్పి గెలిచిన తర్వాత అరు లో ఐదు గ్యారంటీ లను అమలు చేయడం లేదని అలాంటి వారి మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని బిఅర్ఎస్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో బాగంగా డిచ్ పల్లి మండలం లోని మెంట్రాజ్ పల్లి, నాకతండా, అమృత పూర్,ఓడ్డర కాలోని ఇందల్ వాయి మండలంలోని ఎత్తు తాండ,దేవి తాండ,రూప్ల నాయక్ తండ, హనుమాన్ తాండ,చంద్రయాన్ పల్లి, గోల్యా తాండ,సమ్యనయక్ తాండ, త్రియాంబాక్ పేట్, రంజిత్ తాండ,స్కూల్ తాండ,గండి తాండ, ఇందల్వాయి తాండ,లలో విసృతంగా ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,రూరల్ ఇంచార్జీ వి. గంగాధర్ గౌడ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పెన్షన్ కు గతంలో కటఫ్ తేది ఉండేదని, ఈసారి కటఫ్ తేది లెకుండానే పెన్షన్ అందజేయడం జరుగుతుందని వివరించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తామని, ఆచరణ సాధ్యమైన హామీ లే ఇచ్చి అదికారంలోకి వచ్చిన వెంటనే హామీ లను నేరవేర్చుత మన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు ప్రారంభమవు తుందని,ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మి మోసపోవద్దని, కాంగ్రెస్ కు ఓటేస్తే దళితబంధు, రైతుబంధు, రైతు బీమా పథకాలతో పాటు ఇంకా అనేక రకాల పథకాలు బంద్ అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వ మని, నిజామాబాద్ రూరల్ ఎమ్మెలే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు. గత పదేళ్ల క్రితం రూరల్ నీయోజకవర్గం లో ఏలాంటి అబివృద్ధి జరుగలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అదికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఒకోక్క గ్రామానికి కోట్లా రూపాయలు మంజూరు చేశానని, కోన్ని మిగిలిన పనులు ఎన్నికలు ముగిసిన తర్వాత నీదులు మంజూరు చేసి పూర్తి చేసే భద్యత నాపై ఉంటుందని, ఇచ్చిన ప్రతి హామీ తప్పకుండా నేరవేర్చుతమని బాజిరెడ్డి గోవర్ధన్ పెర్కొన్నారు.ఓట్ల కోసం కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు వస్తే అభివృద్ధి విషయంలో వారిని నిలదీయాలని, వారి మాటలు నమ్మితే ప్రజలు మోసపోతారని, గ్రామాలను అభివద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలపలన్నారు. దళితబంధును, రైతు బంధు అమలు చేస్తే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఆ పథకాన్ని ఆపాలని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల క్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేసి దళిత బంధు ఇతర పథ కాలు రాకుండా చేశారని లేకుంటే ఇప్పటికే రైతు రూణమఫీ పూర్తవుతుండేదని,ఇంకా 4 వందల కోట్ల మేర చెల్లించాల్సి ఉందని అదికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ అవుతుందని పేర్కొన్నారు. ఎంపీ గా గెలిపిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ వ్రాసిచ్చిన ఎంపీ అరవింద్ ఐదేళ్లు గడిచిన పసుపు బోర్డు తేలేదని వారికి ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతా రన్నారు. గత కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని 45 ఏళ్ల పాటు పాలించారని, అప్పట్లో కరెంట్ 4-5 గంట లు మాత్రమే ఇచ్చేవారని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తూ రెండు పంటలకు నీరు ఇస్తున్న ఘనత సిఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేసేందుకు సీఎం ప్రత్యేకంగా మెనిఫెస్టోలో ప్రకటించారన్నారు. అనంతరం ఆయా గ్రామాలలో, తండాల్లోని ఆలయలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు మంగళ హారతులు, బోనాలతో బాజిరెడ్డి గోవర్ధన్ కు ఘనస్వాగతం పలికారు.అంతకుముందు అమృత పూర్ గ్రామానికి చెందిన పలువురు బిజెపి నాయకులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, ఎంపీపీ భాదవత్ రమేష్ నాయక్,మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి,చిలువేరి దాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లోలం సత్యనారాయణ, ఎంపిటిసి లో ఫోరం మండల అధ్యక్షులు డి సాయిలు, సినియర్ నాయకులు శక్కరి కొండ కృష్ణ, మోహమ్మద్ యూసఫ్, అమీర్ ఖాన్, జాకిర్,వైస్ ఎంపీపీ భూసని అంజయ్య, సర్పంచులు మోహన్ నాయక్, తరసింగ్, చింతల దాస్,పులి శ్రీనివాస్, పులి వసంత, పాశం కుమార్, అరటి రఘు, గడ్కోల్ శ్రీనివాస్, సిహెచ్ దాస్, అంబర్ సింగ్, సోసైటి చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, రాజు నాయక్ ,తో పాటు తదితరులు పాల్గొన్నారు.