18 ఏండ్లు నిండిన వారందరూ నూతన ఓటర్లుగా నమోదు కావాలి

నవతెలంగాణ-పాల్వంచ
అక్టోబర్‌ ఒకటవ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వారందరూ నూతన ఓటరుగా నమోదు కావాలని జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నూతన ఓటర్లు నమోదు, నూతన పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు, చిరునామా మార్పు, ఓటు హక్కు వినియోగం పై అవగాహన, మరణించిన ఓట్ల తొలగింపు అయితే అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులు లేని ఆరోగ్యవంతమైన ఓటర్‌ జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు జిల్లా యంత్రంగానికి సహకరించాలని చెప్పారు. ఓటర్‌ జాబితా తయారులో ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా ఉండేందుకు ప్రతివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒకటే ఇంటి నెంబర్‌లో ఎక్కువ ఓట్లున్న అంశంపై పరిశీలన జరుగుతున్నట్లు చెప్పారు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేరువేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లుగా ఉండకూడదని ఒకే పోలింగ్‌ ఉండాలని చెప్పారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహణలో ఈవీఎంలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పారు. ఈ నెలలో ఆర్డీవో కార్యాలయంలో ఈవీఎంల మొదటి దశ పరిశీలన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. జిల్లాకు 1600 ఈవీఎంలు ఎన్నికల సంఘం కేటాయించినట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ విధానంలో ఎలాంటి పొరపాట్లు అవకాశం ఉందని చాలా నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరుగుతాయని చెప్పారు. ప్రజల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పై అవగాహన కల్పించాలని చెప్పారు. నివాసాలకు దూరంగా ఉన్న 1500 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో నూతన పోలింగ్‌ ఏర్పాటుపై రాజకీయ పార్టీలు ప్రతిపాదనలు అందజేయాలని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాలు 153, 157లో ఉన్న ఓటర్లు ప్రస్తుతం అక్కడ నివాసం ఉండడం లేదని రాజకీయ పార్టీలు తెలపగా ప్రత్యేకంగా విషయాన్నీ నిర్వహించే జాతీయ తయారు చేస్తామని ఆయన చెప్పారు. ఈ సమా వేశంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సురేష్‌, సిబ్బంది నవీన్‌, బీఎస్పీ నుండి బట్టి ఆనందరావు, బిజెపి నుండి నోముల రమేష్‌, లక్ష్మణ్‌, అగర్వాల్‌, కాంగ్రెస్‌ నుండి శ్రీకాంత్‌, మధు, సీపీఐ(ఎం) నుండి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love