మహమ్మద్ సిరాజ్‍‌కు డీఎస్పీ పోస్ట్ కేటాయింపు

Allotment of DSP post to Mohammed Sirajనవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్ట్‌ను కేటాయించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేందర్ ఆయనకు డీఎస్పీ నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు సిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 78లో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సిరాజ్‌కు డీఎస్పీ పోస్టును కేటాయించారు.

Spread the love