త్వరలోనే సినీ పరిశ్రమ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం: అల్లు అరవింద్

నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధారణ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. నేడు గానీ, రేపు గానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. దీనిపై టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషదాయకమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని, త్వరలోనే చిత్ర పరిశ్రమ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని వెల్లడించారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వాలకు కొత్త కాదని పేర్కొన్నారు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమను ఎంతో ప్రోత్సహించాయని, ఈ ప్రభుత్వం కూడా అదే రీతిలో ప్రోత్సాహం అందిస్తుందని భావిస్తున్నామని అల్లు అరవింద్ వివరించారు.

Spread the love