బేబీ విజయం ఖాయం : అల్లు అరవింద్‌

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ నటించిన చిత్రం ‘బేబీ’. మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్‌ చేశాయి. విజరు బుల్గానిన్‌ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్‌, ట్రైలర్‌లో సాయి రాజేష్‌ రాసిన డైలాగ్స్‌ అందరినీ కదిలిస్తున్నాయి. ఈ మూవీ నేడు (శుక్రవారం) రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్‌ బిగ్‌ టికెట్‌ను రిలీజ్‌ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కొంత కాలం క్రితం బేబీ రషెస్‌ చూశాను. ఇది కల్ట్‌ సినిమా. రాజేష్‌ ఆకారం చూస్తే కల్ట్‌ అనిపించదు. కానీ బుర్రంతా కల్ట్‌. ఆయన హార్ట్‌ను ఎంత మంది బ్రేక్‌ చేశారో తెలియడం లేదు. తనకొ మంచి ప్రేమి కుడు. విజరు అద్భుతంగా మ్యూజిక్‌ ఇచ్చాడు. వైష్ణవిది రియల్‌ ఎమోషన్‌. అలాంటి ఎమోషన్లు ఈ సినిమాలెన్నో ఉన్నాయి. ఆనంద్‌ గురించి విజరుకి ఫోన్‌ చేశాను. రష్‌ చూశాను.. మీ తమ్ముడు ఏంటి చించేశాడు? అని అన్నాను. కొన్ని సీన్లలో ఆయన నటన చూస్తే మన కంట్లోంచి నీరు వస్తుంది. త్రీ రోజెస్‌ చూసినప్పుడే బాల్‌ రెడ్డి గురించి అడిగాను. బాల్‌ రెడ్డి మట్టిలో మాణిక్యం లాంటివాడు. చాక్లెట్‌ బారు విరాజ్‌ అశ్విన్‌ కూడా అద్భుతంగా చేశాడు. ధీరజ్‌ త్వరగా పైకి వస్తాడు. బేబీ దర్శక, నిర్మాతలకు ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘ఈ సినిమా కోసం చాలా మంది ప్రాణం పెట్టి పని చేశారు. ఈ మధ్య కాలంలో సినిమాలో ఒక్క పాట బాగుంటే చాలు ఫేట్‌ మారుతుంది. అలా నాకు విజరు బుల్గానిన్‌ ఆరు పాటలు ఇచ్చాడు. ఆ ఆరు పాటల కోసం నేను రెండొందల పాటలు రిజెక్ట్‌ చేశాను. అవన్నీ కూడా ఎంతో గొప్పగా ఉంటాయి. ఈ సినిమాతో విజరుకి పెద్ద బ్రేక్‌ రాబోతోంది. బేబీలోని ఆత్మ విజరు, బాల్‌ రెడ్డి వల్లే వచ్చింది. బన్నీవాసు, మారుతి, రవి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. విప్లవ్‌ అద్భుతంగా సినిమాను ఎడిట్‌ చేశాడు. ఎంత నిడివి ఉన్నా కూడా మిమ్మల్ని పరిగెత్తిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఓ ప్రత్యేకమైన సినిమా’ అని సాయి రాజేష్‌ చెప్పారు.
నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ,’నేను ఈ సినిమాను అల్లు అరవింద్‌కి అంకితం చేస్తున్నాను. సోలో నిర్మాతగా నన్ను నిరూపించుకోమని ఆయన అన్నారు. నా ఫ్రెండ్‌ మారుతికి ఓ మాటిచ్చాను. ఆయన డబ్బులు పోగొట్టు కోకూడదని అనుకున్నాను. టేబుల్‌ ప్రాఫిట్‌తో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం. ఇదే నేను ఆయనకు ఇచ్చే గిఫ్ట్‌. బన్నీ వాస్‌, మారుతి, యూవీ వంశీ వల్లే నేను ఇండిస్టీలో ఉన్నాను. నా స్నేహితుడు సాయి రాజేష్‌ కోసమే ఈ సినిమా తీశాను’ అని అన్నారు. సహ నిర్మాత ధీరజ్‌ మొగిలి మాట్లాడుతూ, ‘మంచి కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని తెలిపారు.

Spread the love