మోడీతో పాటు అదానీ ఓడిపోయారు

మోడీతో పాటు అదానీ ఓడిపోయారు– కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ
దేశానికి తమ కూటమి కొత్త విజన్‌ ఇచ్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో మోడీతో పాటు అదానీ ఓడిపోయారని విమర్శిం చారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గేతో కలిసి ఆయన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఎన్నికల్లో బీజేపీతో పాటు అనేక సంస్థలతో పోరాడామని తెలిపారు. మోదీ, అమిత్‌ షా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడేందు పోరాటం చేశామని, ఇందుకు ఇండియా బ్లాక్‌ ఐక్యంగా పని చేసిందని రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపై మోడీ ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. ఇండియా బ్లాక్‌కు ప్రజలు అండగా నిలబడ్డారని అన్నారు. రాహుల్‌గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్‌ పుంజుకుందని తెలిపారు. మోడీ పాలనలో విపక్షాలను ఈడీ, సీబీఐతో బెదిరించారని తెలిపారు. ఇండియా బ్లాక్‌ నేతలు ఏకతాటిపై నిలిచారని అన్నారు. ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించామని, దేశంలో ప్రజాస్వామ్యం గెలిచిందని తెలిపారు.ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదని.. ఇది మోడీకి ఘోర పరాజయమని విమర్శించారు.

Spread the love