నవతెలంగాణ- హైదరాబాద్: టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా? అవును. యూపీలోని ఓ ఎస్సై లంచాన్ని కోడ్ భాషలో ‘ఆలుగడ్డలు’ అని అడిగి బుక్ అయ్యారు. భావల్పూర్ ఎస్సై రాంకృపాల్ సింగ్ ఓ కేసును పరిష్కరించేందుకు రైతుకు ఫోన్ చేసి 5 కేజీల బంగాళాదుంపలు కావాలని డిమాండ్ చేశాడు. తాను అంత ఇవ్వలేనని, 2 కేజీలు ఇస్తానని బాధితుడు చెప్పాడు. ఆఖరికి 3 కేజీలకు సెటిల్మెంట్ అయింది. ఈ ఆడియో వైరల్ కావడంతో ఎస్సైని అధికారులు సస్పెండ్ చేశారు