డిచ్ పల్లి మండలంలోని ఖిల్లా డిచ్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 2002-2003, సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా వారికి విద్య బుద్ధులను నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులందరూ ఒకే వేదికపై కలుసుకొని ఆప్యాయంగా,పలకరించుకుని ఒకరి నోరు యోగా క్షేమాలు అడిగి తెలుసుకుని ఆనాటి జ్ఞాపకాలను ఆత్మీయ పలకరింపులు, నాటి మధుర స్మృతులను తలుచుకొని ఆనందంగా గడిపారు.పూర్వ విద్యార్థులందరూ ఒకేచోట చేరవడంతో సందడి నెలకొంది. వారంతా చిన్ననాటి స్నేహితులు.. ఒకేచోట చదువుకున్నారు.. పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ క్రమశిక్షణ చిన్నతనం నుండే అలవాటు చేసుకోవాలని, ఈనాడు సర్వత్రా క్రమశిక్షణ లోపించడం వలన, ఫ్రెండ్లీ పోలీస్ వలన, కొన్ని చట్టాల వలన యూత్ చెడు తోవ పడుతున్నదని పేర్కొన్నారు. నేను పి. టీ. ఉన్న సమయం లో జాతీయ స్థాయి ల లో క్రీడాకారులు గా తీర్చిదిద్దిన ఉన్న ఊరును, కన్నా తల్లి, తండ్రిలను,ఏన్నాడు మరువద్దని,శరీరానికి వ్యాయామం ఎంతో అవసరమన్నారు.
అందరు వ్యాయామం చేయాలని, కుంటుంబం లో పిల్లల బాధ్యత తల్లి తండ్రిల తర్వాత ఉపాధ్యాయులదే బాధ్యత ఉంటుందని వివరించారు.విద్యార్థులు ఈ ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ ఇలాగె కొనసాగించుకోవలని,కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇలాగే కొనసాగాలని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థినిరాలు రజిత మాట్లాడుతూ తల్లిదండ్రులు తర్వాత గురువులే దైవ సమానులుగా భావించకుంటామని, మా గురువుల వల్లనే ఈరోజు మాకు ఈ క్రమశిక్షణ నేర్చుకునే అవకాశం కల్గిందన్నారు. 21ఏళ్ళ తర్వాత నా తోటి మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డిచ్ పల్లి ప్రధానోపాధ్యాయులు సీతయ్య, ఉపాధ్యాయులు, అవదేశ్ ,ధృపతి కుమార్, వేంకటేశ్వర్, నారాయణ,షేక్ హైదర్ , విజయలక్ష్మి, దామోదర్, హరిచరణ్, జలెందర్,వీరితో పాటు పూర్వవిద్యార్టీని, విద్యార్థులు పాల్గొన్నారు.