తోటి విద్యార్థికి పూర్వ విద్యార్థుల చేయూత

నవతెలంగాణ – నసురుల్లాబాద్
అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తోటి విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు నసురుల్లాబాద్ మండలం నెమ్లీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు. మండలంలోని కశేట్ పల్లి గ్రామనికి చెందిన రహిమ్ పాషా గత కొన్ని రోజులుగా పక్షవాతం రావడంతో అనారోగ్యానికి గురయ్యారు దీనితో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో పూర్వ విద్యార్థులు స్పందించి 1994. 95. టెన్త్ బ్యాచ్ విద్యార్థులు,  పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది, ధైర్యంగా ఉండాలని తోటి విద్యార్థికి ధైర్యాన్ని ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు. తన తోటి పాఠశాల స్నేహితులు ఇంటికి రావడం, ఆర్థిక సాయం చేయడంతో రహీం కృతజ్ఞతలు తెలిపాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి సేవా భావాన్ని చాటుకుంటున్న 1994-95 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఆర్థిక సాయం చేసినవారిలో సంతోష్ గుప్తా, మోహన్ రెడ్డి, దస్తాగౌడ్, సాయిబాబా, రెడ్డి, రమేష్, కల్లూరు మోహన్, నాగరాజు, తత్తరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

Spread the love