రాష్ట్రస్థాయి సీనియర్ నెట్ బాల్ పోటీలకు పూర్వ విద్యార్థులు ఎంపిక

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని గండివేట్ గ్రామానికి చెందిన జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల చెందిన పూర్వ విద్యార్థులు రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు  గండివేట్ పూర్వ విద్యార్థులు  ఖాసీం, మహేందర్ , ప్రశాంత్ , అరుణ్ గౌడ్ , మహేష్ కామారెడ్డి జిల్లాకు ఎంపిక అయి ఈ నెలలో 9 నుండి 11 వరకు నిర్మల్ జిల్లా లో జరిగిన 6వ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నెట్ బాల్ పోటీలకు కామారెడ్డి జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఈ నెల 6న గండివేట్ ఉన్నత పాఠశాల జరిగిన సెలెక్షన్స్ లలో చక్కటి ప్రతిభ కనబరచి ఈ పోటీలకు ఎంపిక అయ్యారని గండివేట్ ఉన్నత పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులు రఘురాం తెలిపారు. ఈ సందర్బంగా గండివేట్ గ్రామ సర్పంచ్ అబ్దుల్ ఫరూక్, పాఠశాల గండివేట్ హెడ్ మాస్టర్ సంజీవ్ రెడ్డి  ఉపాధ్యాయ బృందం  క్రీడకారులను అభినందించడం జరిగింది.
Spread the love